దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరవచ్చని ప్రతి విద్యార్థి భావిస్తారు. అందుకే ఇంటర్ అర్హతతో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్, ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ ద్వారా ఐఐటీల్లో అడ్మిషన్ పొందాలని పోటీ పడుతుంటారు. అయితే అందరికీ సీట్లు దక్కవు. మరికొందరు సాధారణ డిగ్రీ చేస్తారు. అలాంటి విద్యార్థులకు ఐఐటీల్లో చదివే మార్గమే.. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్ (జేఏఎం). ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం ద్వారా పీజీ స్థాయిలో సీటు పొందవచ్చు.
ఈ విద్యా సంస్థలు బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌లో పీజీ కోర్సులు అందిస్తున్నాయి. ఐఐటీలు అందించే ఎమ్మెల్సీ, పీహెచ్‌డీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. ఇటీవల జామ్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.2000 (రెండు పేపర్లకు రూ.2700), మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 (రెండు పేపర్లకు రూ.1350) చెల్లించాలి. ఈ పరీక్షను ఐఐటీ ముంబై నిర్వహించనుంది.