విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఏపీలో రేపే ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌

AP SSC Results 2022 release Tomorrow.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు రేపు(శ‌నివారం) విడుద‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2022 10:07 AM IST
విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ఏపీలో రేపే ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు రేపు(శ‌నివారం) విడుద‌ల కానున్నాయి. ఈమేర‌కు విద్యాశాఖ తెలియ‌జేసింది. శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఫ‌లితాలను విడుదల చేయ‌నున్నారు. ఈసారి గ్రేడ్‌లకు బదులు మార్కుల రూపంలో ఫలితాలను ప్ర‌క‌టించ‌నున్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రెండు సంవ‌త్స‌రాలు ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే విద్యార్థుల‌ను పాస్ చేశారు. ఈ సారి క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఏప్రిల్ 27 నుంచి మే 9 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 6,21,799 మంది విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రాశారు.

ర్యాంకుల ప్రకటనలపై నిషేధం..

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ ఫలితాల తరువాత విద్యాసంస్థలు ర్యాంకులను ప్ర‌క‌ట‌న‌ల రూపంలో ఇవ్వడంపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది రాష్ట్ర విద్యాశాఖ‌. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ 83వ నంబరు జీవో జారీచేశారు.

Next Story