ఏపీ పాలిసెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకోండి

AP POLYCET 2022 Results Out.పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన ఏపీ పాలిసెట్‌-2022 ప‌రీక్షా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2022 10:48 AM IST
ఏపీ పాలిసెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకోండి

పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన ఏపీ పాలిసెట్‌-2022 ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. విజ‌య‌వాడ‌లో రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాల శిక్షణ శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శ‌నివారం ఉద‌యం ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇప్పటికే పాలిసెట్‌ ఆన్సర్‌ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటెట్‌) విడుదల చేసిన విషయం తెలిసిందే. 1,31,627 మంది విద్యార్థులు ప‌రీక్ష రాయ‌గా.. 91.84శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఫ‌లితాల కోసం https://polycetap.nic.in/ లేదా http://sbtetap.gov.in/ వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అయి ఫలితాలను చూడొచ్చు. ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు.

ఏపీ పాలిసెట్‌-2022 ప‌రీక్ష కోసం మొత్తం 1,38,189 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 404 కేంద్రాల్లో పాలిసెట్ ప‌రీక్ష‌ను మే 29న నిర్వ‌హించారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో 1,31,627 మంది విద్యార్థులు ప‌రీక్ష రాశారు. ఇందులో 90.56 శాతం బాలురు, 93.96 శాతం బాలిక‌లు ఉత్తీర్ణుల‌య్యారు.

Next Story