ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. పాలిసెట్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

AP Polycet-2022 admissions start from july 29. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అడ్మిషన్లను షెడ్యూల్‌ రిలీజైంది. డిప్లొమా కోర్సులు చేసేందుకుగాను

By అంజి  Published on  25 July 2022 8:51 AM GMT
ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. పాలిసెట్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అడ్మిషన్లను షెడ్యూల్‌ రిలీజైంది. డిప్లొమా కోర్సులు చేసేందుకుగాను ఏపీ పాలిసెట్‌ -2022 పరీక్షను మే నెలలో నిర్వహించారు. తాజాగా ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ రిలీజ్ చేసింది. పాలిసెట్-2022లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు.. పాలిటెక్నిక్‌లోని వివిధ కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు కోసం విద్యార్థులు ర్యాంక్, వివరాల నమోదు కోసం ఆన్‌లైన్ ద్వారా రూ.900 చెల్లించాలి.

జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఓసీ విద్యార్థులు రూ.900, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. మొదటి ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ హోల్డర్లు విద్యార్హతల సర్టిఫికెట్లు, పాలిసెట్-2022 ర్యాంక్ కార్డ్‌తో జూలై 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే కౌన్సిలింగ్‌ సెంటర్లకు హాజరు కావాలి.

10,001 నుంచి 25,000 ర్యాంకు ఉన్నవారికి జూలై 30న, 25,001 నుంచి 40,000 ర్యాంకుల వారికి జూలై 31న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, 40,001 నుంచి 55000 ర్యాంకుల వారికి ఆగస్టు 1న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. 55,001 నుంచి 71,000 మంది ర్యాంకుల వారికి ఆగస్టు 2న వెరిఫికేషన్‌, 71,001 నుంచి 87,000 మధ్య ర్యాంకులు వారికి ఆగస్టు 3న, 87,001 నుంచి 1,04,040 ర్యాంకులు పొందిన వారు ఆగస్టు 4 న, 1,04,041 నుండి చివరి ర్యాంక్ వరకున్న విద్యార్థులు ఆగస్టు 5న హాజరుకావాలి.

అలాగే ఆగస్టు 2 నుంచి 5 వరకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 6, 7 తేదీల్లో ర్యాంక్ 1 నుంచి 40,000 వరకు, ఆగస్టు 8,9 తేదీల్లో ర్యాంక్ 40,001 నుంచి 80,000 వరకు, ఆగస్టు 11న 80,001 ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు కాలేజీలను ఎంపిక చేసుకునే వీలుకల్పించారు. విద్యార్థులు ఆగస్టు 12న వెబ్ ఆప్షన్‌లను మార్చుకోవచ్చు.

Next Story
Share it