ఏపీలో ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్), ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష) పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది, ఈసెట్ ఫలితాల్లో 29,904(92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఫలితాల కోసం sche.ap.gov.in లో చూడొచ్చు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించింది.
ఐసెట్ ఫలితాల కోసం ఇలా చేయండి
1. APICET అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.inను ఓపెన్ చేయండి.
2. APICET 2021 అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
3. దీంతో మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ APICET 2021 రిజల్ట్ అని ఉన్న దానిని ఎంచుకోండి.
4. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి.
5. వ్యూ రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. పరీక్ష ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
6. భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.