నేడే ఏపీ, తెలంగాణ టెన్త్ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 16, 2026 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను బుధవారం బోర్డు ఖరారు చేసింది.

By -  అంజి
Published on : 5 March 2026 8:44 AM IST

TS SSC Hall Tickets 2026, Telangana 10th Class Hall Tickets Download, bse.telangana.gov.in Hall Tickets,AP SSC Hall Tickets 2026 Download, AP 10th Public Exam Hall Tickets, Mana Mitra WhatsApp Hall Tickets AP

నేడే ఏపీ, తెలంగాణ టెన్త్ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 16, 2026 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను బుధవారం బోర్డు ఖరారు చేసింది. షెడ్యూల్ ప్రకారం, మార్చి 5, 2026 (గురువారం) ఉదయం 11 గంటలకు హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.ఎస్. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులు తమ హాల్ టికెట్లను వివిధ మార్గాల ద్వారా సులభంగా పొందేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా, పాఠశాల విద్యాశాఖకు చెందిన LEAP అప్లికేషన్ ద్వారా లేదా వాట్సాప్ గవర్నెన్స్ - మన మిత్ర (Mana Mitra) సర్వీస్ నంబర్ 9552300009 కు సందేశం పంపడం ద్వారా కూడా హాల్ టికెట్లను పొందవచ్చని డైరెక్టర్ వివరించారు.

తెలంగాణలో కూడా..

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈసారి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు మూడు రకాలుగా హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

హాల్‌టికెట్లు పొందే మార్గాలు:

అధికారిక వెబ్‌సైట్: విద్యార్థులు నేరుగా bse.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా: టెక్నాలజీని వాడుకుంటూ ఈసారి విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు కూడా హాల్‌టికెట్లను పంపేలా ఏర్పాట్లు చేశారు.

పాఠశాలల్లో: వెబ్‌సైట్ వాడటం కుదరని వారు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి నేరుగా ప్రింటెడ్ హాల్‌టికెట్లను పొందవచ్చు. స్కూళ్లకు కూడా అదే సమయానికి హాల్‌టికెట్లు చేరుతాయని అధికారులు తెలిపారు.

ముఖ్య సమాచారం:

విద్యార్థులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ లేదా స్కూల్ నుంచి తీసుకున్న ఒరిజినల్ హాల్‌టికెట్.. ఇలా ఏది తీసుకువచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5,28,248 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి.

Next Story