ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఏప్రిల్ 18 లేదా 19న విడుదలయ్యే వచ్చే ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.

By -  అంజి
Published on : 12 April 2026 1:30 PM IST

AP Inter Results 2026, BIEAP, Andhra Pradesh Intermediate Results, Inter Marks Memo Download, AP 1st Year Results, AP 2nd Year Results, Results Date and Time

ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఏప్రిల్ 18 లేదా 19న విడుదలయ్యే వచ్చే ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను త్వరలోనే వెల్లడించనుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఫలితాలు ఏప్రిల్ 18 లేదా 19 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, బోర్డు నుంచి ఖచ్చితమైన తేదీ , సమయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఫలితాలను ఎలా చూసుకోవాలి?

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఈ క్రింది అధికారిక వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

bieap.apcfss.in

resultsbie.ap.gov.in

వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ‘AP Inter Results 2026’ లింక్‌పై క్లిక్ చేసి, విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో లభించే మార్కుల మెమో కేవలం తాత్కాలికం మాత్రమేనని, అసలు సర్టిఫికేట్లను ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత పాఠశాలలు/కళాశాలల ద్వారా పంపిణీ చేస్తారని బోర్డు స్పష్టం చేసింది.

మార్కుల విధానం, తదుపరి ప్రక్రియ:

ఇంటర్మీడియట్ స్కోర్‌కార్డ్‌లో సబ్జెక్టుల వారీగా మార్కులు, మొత్తం మార్కులు, ఉత్తీర్ణత స్థితి వంటి వివరాలు ఉంటాయి. ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులకు 100 మార్కులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సైన్స్ సబ్జెక్టుల థియరీకి 60 మార్కులు, గణితానికి 75 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఫలితాల ప్రకటన తర్వాత, ఫెయిల్ అయిన లేదా మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల వివరాలను బోర్డు వెల్లడిస్తుంది.

Next Story