ముఖ్యాంశాలు

  • శ్రీభాగ్‌ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌
  • బంద్‌లో పాల్గొన్న ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలు

కడప: రాయలసీమ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ కొనసాగుతోంది. శ్రీభాగ్‌ ఒప్పందం అమలు చేయాలని ఏకైక డిమాండ్‌తో రాయలసీమలోని విద్యా సంస్థల బంద్‌కు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌కు ప్రైవేట్‌ విద్యా సంస్థలు సంఘీభావం తెలిపాయి. బంద్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రజా, యువజన, విద్యార్థి సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీభాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. వెనుకబడిన సీమ ప్రాంతంల రాజధానైనా, హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బంద్‌ నేపథ్యంలో విద్యాసంస్థలకు యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నగరంలోని కోటిరెడ్డి కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీమ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఆందోళనలో భాగస్వామ్యం కావాలని జేఏసీ నేతలు కోరారు. అనాదిగా సీమ పట్ల కొనసాగుతున్న వివక్షను సహించేది లేదని నేతలు హెచ్చరించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.