అంగారకుడిపై ఆహారం పండించవచ్చు...!

By సత్య ప్రియ  Published on  17 Oct 2019 7:05 AM GMT
అంగారకుడిపై ఆహారం పండించవచ్చు...!

జాబిల్లి, అంగారకుడిపై భవిష్యత్తులో మానవులు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే, వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అక్కడే పండించుకోవచ్చని.. నెదర్లాండ్స్ లోని వేజ్ నింజన్ పరిశోధక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు.

అంగారకుడు, చంద్రుడి ఉపరితంలపై ఉండే మట్టి తరహా నమూనాల్లో టమాటా, ముల్లంగి, మెంతి, పాలకూర, బఠానీ వంటి పది రకాల పంటలను వారు ప్రయోగాత్మకంగా పండించారు. పాలకూర మినహా అన్ని పంటలు బాగా పెరిగాయని, ఆహారంగా వినియోగించేందుకు వీలుగా వాటి ఉత్పత్తులు ఉన్నాయని తేల్చారు.

ఈ పంటలతో లభించే కొన్ని విత్తనాలు తిరిగి సాగుకు ఉపయోగపడేలా కూడా ఉన్నట్లు నిర్థారించారు.

Next Story