ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భ‌ర్తీకి ఈసీ షెడ్యూల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 9:51 AM GMT
ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భ‌ర్తీకి ఈసీ షెడ్యూల్‌

ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 18న ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువరించనుంది. జులై 6న పోలింగ్‌ నిర్వహించనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. 26న నామినేషన్లను పరిశీలన చేపట్టనున్నారు. 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇదిలావుంటే.. టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని శాసనసభ్యుల కోటాలో భర్తీ చేయనున్నారు. డొక్కా మార్చి 9న తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Next Story
Share it