విశాఖలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి

By సుభాష్  Published on  15 Jun 2020 8:40 AM GMT
విశాఖలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై చెప్పులతో దాడి

విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తల నెలకొంది. ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబును వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా, రామకృష్ణాపురంలో పలు అభివృద్ది పనుల శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేపై చెప్పులు, కొబ్బరి చిప్పలు, రాళ్లు రువ్వారు. అవి టీడీపీ నేతలకు తగలడంతో తవ్రంగా గాయాలయ్యాయి.

అయితే దాడికి దిగిన వైసీపీ నేతలు తమ ప్రాంతానికి చెందిన వారు కాదని రామకృష్ణాపురం వాసులు చెబుతున్నారు. వైసీపీ నేతలు అభివృద్ధి నిరోధకులని , అభివృద్ది కార్యక్రమాలకు వస్తే ఇలాంటి దాడుల చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే రామకృష్ణబాబు మండిపడ్డారు. తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడమే నేర్పించారని, ఇలా రౌడీ యీజం చేయడం నేర్పించలేదన్నారు.

Next Story
Share it