విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన మర్చిపోకముందే మరెన్నో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిశ్రమ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక విశాఖ ఘటన తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరుసగా ఎన్నో గ్యాస్‌ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా తూర్పుపాలెం వద్ద ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. తూర్పుపాలెం నుంచి మోరీ గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్‌కు వెళ్లే ఈ పైప్‌లైన్‌ పగిలిపోవడంతో భారీగా గ్యాస్‌ లీక్‌కావడంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఓఎన్‌జీసీ సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగి గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సుభాష్

.

Next Story