భూకంప జోన్‌లో విజయవాడ..అమరావతి పరిస్థితి ఏంటీ..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 11:22 AM GMT
భూకంప జోన్‌లో విజయవాడ..అమరావతి పరిస్థితి ఏంటీ..?!

పెద్దలు మాట సద్ది మూట అంటారు. సామెతలు ఊరకే పుట్టవు. అనుభవం నుంచి పుడతాయి. పెద్లల మాట వినకపోతే చెడిపోతావు..భవిష్యత్తులో నష్టపోతావు అని కూడా ఆ సామెత అర్దం. కాని..ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాత్రం తన అనుభవంతో రాజధానిని ఎక్కడైతే శ్రీకృష్ణ కమిటీ వద్దన్నదో అక్కడే కట్టాడు. పైగా వాస్తుపరంగా సూపర్ అంటూ తన అనుకూల పత్రికల్లో రాయించారు. అమరావతికి భూకంప ముప్పుతోపాటు, వరద ముప్పు కూడా ఉందని శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఫలితం ఈ మధ్య కాలంలో వచ్చిన వరదల్లో అమరావతి ఎలా మునిగిందో చూశాం .సాక్షాత్తూ చంద్రబాబు ఇంట్లోకి కృష్ణా నది నీళ్లు వచ్చాయి.

అమరావతిని ప్రపంచ పటంలో నిలబెడతానని చంద్రబాబు చెప్పని రోజులేదు. అమరావతిలొని చాలా భూములు తన సింగపూర్‌ మిత్రులకు, తమ పార్టీ పెద్దలకు చంద్రబాబు ధారాదత్తం చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. అయితే...గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌ సీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో రాజధాని ఉంటుందా ? ఉండదా? అనే విషయంలో పెద్ద పొలిటికల్ దుమారమే లేచింది. దీనిపై వైఎస్ఆర్ సీపీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకున్నా...అధికార వికేంద్రీకరణ చేపడతామని సీఎం వైఎస్ జగన్ సహా, ప్రభుత్వ పెద్దలు పలుమార్లు ప్రకటించారు. గత బడ్జెట్‌లో అమరావతికి పెద్దగా నిధులు కూడా కేటాయించలేదు.

ఇదంతా ఒక ఎత్తయితే..ఐఐటీ హైదరాబాద్ - నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌ మెంట్ - కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఓ పరిశోధన చేశాయి. ఈ పరిశోధనలో తేలింది ఏమంటే... దేశంలోని 50 కీలక ప్రాంతాలు భూకంప జోన్‌లో ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం..వచ్చే వందేళ్లలో విజయవాడ, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ నగరాలకు భూకంప ముప్పు పొంచి ఉంది. ఈ నివేదికలో విజయవాడకే భూకంపం పరిమితం అనుకుంటే పొరబాటే. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న అమరావతికి భూకంప ముప్పులేదంటూ నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.ఈ లెక్కన అమరావతి కూడా భూకంప జోన్‌లో ఉన్నట్లే లెక్క.

అమరావతికి వరద ముప్పుతోపాటు అనేక సమస్యలున్నాయి. అక్కడ నేల ఇసుకతో కూడిన మట్టితో ఉంటుంది. అందువలన పునాదులు బలంగా ఉండవు. సముద్ర తీరానికి దగ్గరగా ఉంది. కృష్ణా నది ఒడ్డునే ఉంది. అలానే ..అమరావతి గుండా కొండవీటి వాగు ప్రవహిస్తుంది. ఈ వాగు వలన కూడా అమరావతికి ప్రమాదమని చాలా మంది హెచ్చరించారు. సో..విజయవాడకు ఆనుకునే ఉన్న అమరావతికి కూడా భూకంప ప్రభావం ఉంటుంది. సో...ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఒక కొత్త ఆయుధం దొరికినట్లైంది. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story