నేపాల్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం మంగళవారం తెల్లవారుజామున సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైనట్లు నేపాల్‌ సిస్మోలాజికల్‌ కేంద్రం వెల్లడించింది. భూకంపం తో పలు ప్రాంతాల్లో భూమి కంపిచింది. డొలాకా జిల్లాలోని జుగు ఏరియాలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. దీని ప్రభావం ఖాట్మాండు, పర్సా, కాస్కీ, సింధుపల్‌చోక్‌ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు హిమాలయ టైమ్స్‌ పేర్కొంది.

కాగా, భూ ప్రకంపనలు సంభవించగానే ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పెద్ద శబ్దంతో భూకంపం సంభవించినట్లు ఏదో జరిగిపోతుందని భయాందోళనకు గురయ్యారు. కాగా, భూకంపానికి గాయపడినట్లుగానీ, మృతి చెందినట్లు గానీ, ఎలాంటి ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. అయితే ఈ భూప్రకంపనలపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఏమైనా ఆస్తినష్టం జరిగిందా అనే దానిపై విచారిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *