ప్రసూతి ఆస్పత్రిపై ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు పసికందులు సహ 14 మంది మృతి

By సుభాష్  Published on  13 May 2020 4:07 AM GMT
ప్రసూతి ఆస్పత్రిపై ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు పసికందులు సహ 14 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఓ ప్రసూతి ఆస్పత్రిలో చొరబడిన ఉగ్రరవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందగా, చాలా మంది వరకూ గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు పసికందులు మృతి చెందారు.

కబూల్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ముగ్గురు ఉగ్రవాదుల ఆస్పత్రిలోకి ప్రవేశించి చికిత్స పొందుతున్న మహిళలు, అప్పుడు పుట్టిన పసికిందులపై కాల్పుల వర్షం కురిపించారు.

ఈ ఘటనలో 14తో పాటు అప్పుడే పుట్టిన ఇద్దరు పసికిందులు చనిపోయారు. మిగతా 12 మందిలో బాలింతలు, నర్సులున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ బాద్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు

కాగా, మరో ఘటనలో 21 మంది మృతి చెందారు. ఓ మిలీషియా కమాండర్‌ అంత్యక్రియల కార్యక్రమంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇందులో 21 చనిపోయగా, చాలా మంది వరకూ గాయాల పాలయ్యారు.

Next Story