భాగ్యనగరంలో భారీగా నగదు స్వాధీనం
By సుభాష్ Published on 1 Nov 2020 11:33 AM GMTహైదరాబాద్ నగరంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. హవాలా సొమ్ముగా భావిస్తున్న కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. ఈ నగదు దుబ్బాక ఉప ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బుగా పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఓటర్లకు పంచడానికి బీజేపీ నేతలే ఈ సొమ్మును తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆయన అన్నారు.
కాగా, ఆదివారం సాయంత్రంతో ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. హైదరాబాద్ నార్త్ జోన్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో ఈ హవాలా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురభీ శ్రీనివాస్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ డబ్బు దుబ్బాకకు తీసుకెళ్తున్నట్ఉల తేలిందని ఆయన అన్నారు.
Next Story