దుబ్బాక: ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి.. రక్షించిన కానిస్టేబుళ్లు
By సుభాష్ Published on 7 Nov 2020 2:27 PM ISTదుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి పిల్లల ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఎండీ మహమ్మద్ 15 సంవత్సరాల కిందట మిర్‌దోడ్డి మండలంలోని మోతే గ్రామానికి వలస వచ్చిడు. అయితే మోతే గ్రామంలో మాంసం విక్రయం కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గుంజేడు సాయిలు ఇంట్లో మహమ్మద్ అద్దెకు దిగాడు.
శనివారం ఉదయం ఉదయం బాగా మద్యం సేవించిన మహమ్మద్ మత్తులో ఇద్దరు కుమార్తెలను ఇంట్లో బంధించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పిల్లలను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పిల్లలను కాపాడిన కానిస్టేబుళ్లు
మహమ్మద్ ఇంటి వద్దకు చేరుకున్న కానిస్టేబుళ్లు రాజిరెడ్డి, రాజు చేరుకున్నారు. పిల్లలను లోపల బంధించి తలుపు గడిచ పెట్టడంతో ఇంటి పైకప్పు నుంచి కానిస్టేబుళ్లు లోపలికి వెళ్లి వెళ్లారు. అప్పటికే ఇద్దరు కుమార్తెల గొంతు గోసిన మహ్మద్ అదుపులోకి తీసుకుని పిల్లలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టుబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.