బ్రేకింగ్ : నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Sept 2020 2:13 PM ISTహైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార పర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో నేటి నుండి దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. దుబ్బాక సహా దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఇక.. నవంబర్ 3న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ నిర్వహించనున్నారు. 10న కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 16 కాగా, నామినేషన్లను 17న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 చివరి తేదీ.
Next Story