ఉన్నత పదవిలో ఉన్న అతను సెక్స్ కు బానిసై వయాగ్రా కూడా వాడుతున్నట్లు తెలుసుకున్నఅధికారులు విస్తుపోయారు. అతనే కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్. భారత్ శత్రుదేశమైన పాక్ ఉగ్రవాదులకు దవీందర్ సహాయం చేస్తూ పట్టుబడి కటకటాలపాలయ్యాడు. దవీందర్ సింగ్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులకు ఉత్తర, దక్షిణ కాశ్మీర్ లో కొన్ని ఆధారాలు, రికార్డులు, సీజ్ చేసిన వస్తువులు లభించాయి. వాటిని చూసిన ఎన్ఐఏ అధికారులు దిగ్ర్భాంతికి గురయ్యారు.

ఎన్ఐఏ అధికారులు ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ కు తెలిపిన వివరాల ప్రకారం అతను ఏ ఇంటెలిజెన్స్ సంస్థకూ పనిచేయకుండా తన ఇష్టానుసారం వ్యవహరించే వాడని తెలుస్తోంది. సెక్స్ కు బానిసైన దవీందర్ లైంగికంగా 12 మంది మహిళలతో టచ్ ఉండేవాడని, వారికోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడని విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన దవీందర్ సింగ్ ను ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ చేస్తోంది. పాక్ ఉగ్రవాదులతో దవీందర్ కున్న సంబంధాలపై ఆరా తీస్తోంది.

ఇటీవలే దేశంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 7 గురు నేవీ అధికారులను కస్టడీలోకి తీసుకున్నారు. వీరందరికీ అందమైన అమ్మాయిలను ఎరగా వేసిన పాక్..భారత్ కార్యకలాపాలను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకోవాలనుకుంది. అదృష్టవశాత్తు పాక్ కుట్ర తెలియడంతో ఆ ఏడుగురిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నేవీ లో పనిచేసే వారెవరైనా సరే సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు వాడకూడదని నిషేధం విధించింది కేంద్రం.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.