మందుబాబుల హంగామా.. అర్థరాత్రి యువతిని..

By Newsmeter.Network  Published on  12 Jan 2020 3:53 AM GMT
మందుబాబుల హంగామా.. అర్థరాత్రి యువతిని..

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట హైఫైవ్‌ పబ్‌ వద్ద అర్థరాత్రి మందుబాబులు నానా హంగామా చేశారు. మద్యం మత్తులో మందు బాబులు ఒకరినొకరు తన్నుకున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్‌ పక్కన గల లిస్బన్‌ పబ్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న యువతిని బైక్‌లతో వెంబడించి తాగుబోతులు వేధించారు. యువతి గట్టిగా కేకలు వేసింది. ఆమెను కాపాడేందుకు వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌తో తాగుబోతులు గొడవపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు నిలదీయడంతో తాగుబోతులు అక్కడి నుంచి పరారయ్యారు. అర్థరాత్రి హై ఫైవ్‌ పబ్బును మూసివేయించడానికి వచ్చిన పోలీసులతో తాగుబోతులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులపై దూషించి, దాడికి యత్నించి మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాగుట్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గతంలో లిస్బన్‌ పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌లు దాడులు నిర్వహించి, పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేశారు. అయిన పబ్‌ నిర్వహకులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు.

నాగోల్‌లోని ఆనంద్‌నగర్‌లో గల ఓ హోటల్‌పై తాగుబోతులు దాడికి దిగారు. మద్యం మత్తులో హోటల్‌ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన యజమానిపై తాగుబోతులు దాడి చేశారు. హోటల్‌ యజమాని మోటర్‌ బైక్‌ను గ్రానైట్‌ రాయితో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హోటల్‌ యజమాని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై, తన హోటల్‌ స్టాఫ్‌ దాడికి దిగారాని యాజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story