డెహ్రాడూన్:  రోడ్డు మధ్యలో ఆగిపోయిన కారు తిరిగి కదలకపోతే మరో కారుతో దానిని కట్టి జాగ్రత్తగా మెకానిక్ దగ్గరకి తీసుకువెళతాం. రోడ్డుమీద ఇలాంటి సీన్లు తరచుగా చూస్తూనే ఉంటాం. మరి హెలికాఫ్టర్ కూలిపోతే.. కొద్ది రోజుల క్రితం కేదారనాథ్‌లో కూలిపోయిన ఒక ప్రైవేట్ హెలికాప్టర్‌ను భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు విజయవంతంగా బయటకు తీసాయి.

కేదార్‌నాథ్ సమీపమంలోని యుటీ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఒక హెలికాప్టర్ కొద్ది రోజుల క్రితం కూలిపోయింది. కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు కాలి నడక మార్గం తప్ప రోడ్డుమార్గం లేకపోవడంతో దానిని తరలించే అవకాశం లేకపోయింది అయితే ఈ నెలాఖరుకు కేదార్‌నాథ్ ఆలయం మూసేస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్‌ను రంగంలోకి దిగింది. రెండు ఎంఐ 17 వి5 హెలికాప్టర్ల సహాయంతో ప్లే ప్రైవేట్ హెలికాఫ్టర్‌ను డెహ్రాడూన్‌లోని సహస్త్ర ధారకు చేర్చింది. కూలిన హెలికాప్టర్‌ను మరో హెలికాప్టర్‌కు తగిలించి తరలించటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.