హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు రూ.18 కోట్లకు సంబంధించిన కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేశారని రవిప్రకాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని రవిప్రకాష్‌ హైకోర్టును కోరారు. రవి ప్రకాష్‌ క్వాష్‌ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 2 వరకు రవిప్రకాష్‌పై ఏలాంటి చర్యలు తీసుకోరాదని బంజారాహిల్స్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 2కు హైకోర్టు వాయిదా వేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.