తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ.10వేలు విరాళమిస్తే వీఐపీ దర్శనం కల్పిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. విరాళల కోసం నేటి నుంచి శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ నుంచి యాప్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 10వేలు విరాళమందించిన భక్తులకు ఒక వీఐపీ దర్శనం కల్పిస్తామన్నారు. వీఐపీ బ్రేక్‌లో ప్రొటో కాల్ దర్శనం ఉంటుందన్నారు. నెల రోజులు ముందుగానే కోటా విడుదల అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆఫ్ లైన్‌లో ఉన్న ఈస్కీంను ..భవిష్యత్తులో ఆన్ లైన్‌లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణం చేపడుతామన్నారు ధర్మారెడ్డి. పురాతన ఆలయాల పునురుద్ధరణ కోసం కూడా ఈ ట్రస్ట్ పని చేస్తుందని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ కేటాయించే విఐపి దర్శనం ద్వారా ..సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండవన్నారు అదనపు ఈఓ ధర్మా రెడ్డి. donate-1ok-vip-visit

donate-1ok-vip-visit

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story