అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వార్నింగ్‌

By సుభాష్  Published on  1 Jan 2020 8:42 PM IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వార్నింగ్‌

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. బాగ్దాద్‌ లోని తమదేశ ఎంబసీపై నిరసనకారులు చేసిన దాడిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌ భూభాగంలోకి తాము వందలాది ట్రూపులను పంపిస్తామని ట్రంప్‌ సర్కార్‌ వెల్లడించింది. గతనెల 29న ఇరాన్‌కు చెందిన కతాబాద్‌-ఏ హిజ్బుల్లా అనే గ్రూపు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 24 మంది మృతి చెందారు. అందుకు ప్రతీకారంగా ప్రో ఇరాన్‌ మిలీషియా సభ్యులు బాగ్దాద్‌ లోని హై సెక్యూరిటీ జోన్‌ పాయింట్లను కాపాడుకుని అమెరికన్‌ ఎంబసీపై దాడులకు పాల్పడ్డారు. ఇరాక్‌ నుంచి అమెరికా దళాలను ఉపసహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అమెరికాకు వ్యతిరేక ఆందోళనకారులు నినాదాలు చేశారు. అలాగే ఎంబసీ కాంపౌండ్‌ కునిప్పటించారు. ఇదిలా ఉండగా, అబూ మహాది అల్‌ ముహందీస్‌ అనే కరడుగట్టిన ఉగ్రవాది తన ప్లాన్‌ ప్రకారం ఉగ్రవాదులను ఈ దాడికి ప్రేరేపిస్తున్నాడని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియా విమర్శించారు. ఇక బాగ్దాద్‌లో రెండో రోజు కూడా ఇరాన్‌ అనుకూల ఆందోళనకారులు అమెరికా ఎంబసీలోకి చొచ్చుకుని వచ్చారు.

Next Story