మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తర్వాత జగన్ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన డొక్కా..తనకు టీడీపీలో కలిసిరాలేదని వ్యాఖ్యానించారు. 2014లోనే తాను వైసీపీలో చేరాల్సిందన్నారు. జగన్ నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీలోకి వచ్చానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చాన్నారు. అందుకు పార్టీ అనేది ఒక వేదిక అని, దాని ద్వారా తనదైన శైలిలో ప్రజలకు సేవలందిస్తానన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..ఎలా పనిచేస్తారో..తన ప్రవర్తన ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రెహమాన్ కూడా వైసీపీలో చేరారు.

రెహమాన్ మాట్లాడుతూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన రోజే వైసీపీకి మద్దతు పలికామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని గెలిచేందుకు ధీమా వ్యక్తం చేశారు.

Also Read :

టీడీపీకి షాకిచ్చిన మాజీమంత్రి

సోమవారం ఉదయమే చంద్రబాబు నాయుడికి రాజీనామా పంపిన డొక్కా మాణిక్య వరప్రసాద్..సాయంత్రానికల్లా వైసీపీలో చేరి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. అలాగే తానెందుకు టీడీపీని వీడాల్సి వస్తుందో కారణాలు పేర్కొంటూ..ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు.

రాణి యార్లగడ్డ

Next Story