మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీకి షాకిచ్చారు. మొదటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు, పార్టీకి దూరంగా ఉన్న డొక్కా..ఇదివరకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా..నేడు రాజీనామా ను చంద్రబాబునాయుడికి పంపారు. అందులోనే పార్టీకెందుకు రాజీనామా చేయాల్సి వస్తోందన్న దానిపై కూడా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీకెందుకు రాజీనామా చేయాల్సి వచ్చేందో పేర్కొంటూ డొక్కా మాణిక్యవరప్రసాద్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలు తనను చాలా బాధించాయన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అసెంబ్లీ సమావేశాలకన్నా ముందే డొక్కా మానసికంగా వైపీసీ వైపు మొగ్గు చూపారు కానీ..వైసీపీ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఏ పార్టీలో ఉన్న ప్రజలకు సేవ చేసేందుకే పనిచేస్తానని డొక్కా తెలిపారు.

కొన్ని ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో జేఏసీ పేరుతో తనపై నీతిబాహ్యమైన ఆరోపణలు చేశారని, అలాంటి చౌకబారు విమర్శలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చాన్నారు. అందుకు పార్టీ అనేది ఒక వేదిక అని, దాని ద్వారా తనదైన శైలిలో ప్రజలకు సేవలందిస్తానన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..ఎలా పనిచేస్తారో..తన ప్రవర్తన ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.

రాణి యార్లగడ్డ

Next Story