అమరావతి: ఏపీ రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్ వ్యూహం మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దసరా నుంచి వైఎస్ఆర్ సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ మధ్యనే మాజీ ఆకుల సత్యనారాయణ వైఎస్ఆర్ సీపీలో చేరారు. జూపూడి ప్రబాకర్ రావు కూడా వైఎస్ఆర్‌ సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నిన్న రాజోలు మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ఆర్ సీపీ కండువా వేసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతారని సమాచారం. వైఎస్ఆర్ తనకు అన్నలాంటి వారని డొక్కా అన్నారు. వైఎస్ జగన్ తనకు బిడ్డతో సమానమని చెప్పారు. వైఎస్ జగన్ అవినీతిపై పోరాటం చేస్తున్నారని..దేశం మొత్తం జగన్ వైపు చూస్తుందని.. అందరూ గర్వించే సీఎంగా జగన్ ఉంటారని డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లను: డొక్కా మాణిక్య వరప్రసాద్

వైఎస్ఆర్‌ సీపీలోకి వెళ్తున్నారన్న వార్తలను టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఖండించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనకు పార్టీ మారాలనే ఆలోచన లేదన్నారు డొక్కా. ఒక వేళ పార్టీ మారాలి అనకుంటే చెప్పే వేరే పార్టీకి వెళ్తానన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story