సింహం కాదు.. గ్రామ సింహం..

By అంజి  Published on  12 March 2020 3:19 AM GMT
సింహం కాదు.. గ్రామ సింహం..

ఒక సింహం జనావాసాల్లోకి వచ్చింది. అందరినీ గడగడ లాడించింది. ప్రాణ భయంతో జనాలు పోలీసులకు సమాచారం అందించారు. సింహాన్ని పట్టుకోవడానికి రంగం లోకి దిగిన పోలీసులు చాలా పకడ్బందీగా ప్రణాళికలు వేశారు. ఆ ప్రాంతం అంతా అలర్ట్ ప్రకటించారు కానీ చివరికి అది సింహం కాదు గ్రామ సింహం అని తెలుసుకొని రిలాక్స్ అయిపోయారు.

ఒక్కోసారి ఎదురుగా ఉన్నదానిని చూస్తూనే మనం భ్రమలో పడిపోతాం అన్న మాటకు స్పెయిన్ లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ.మార్చి 7న ఈ ఘటన జరిగింది. ఆ కుక్క హెయిర్ అచ్చు సింహం లానే ట్రిమ్ చేసి ఉంది. దీనితో అది సింహమే అనుకున్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. స్థానికులు చెప్పినట్టే.. ఓ భారీ సైజులో ఉన్న జంతువు ఒకటి వారి కంట పడింది. అదే సింహం అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. అది సింహం కాదు కుక్క అని తేలింది. దీంతో అధికారులు, స్థానికులు అవాక్కయ్యారు. నిజానికి ఆ ప్రాంతానికి కొత్తగా ఎవరు వచ్చినా ముందు దానిని చూడగానే ప్రాణభయంతో పరుగెడతారట అది సింహం కాదన్న విషయం తొలిసారిగా దాన్ని చూసిన వారెవరూ గ్రహించలేరట. ప్రస్తుతం కుక్కకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాని ఫోటోను చూసి నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.

Next Story