బెంగళూరు: పులిని చూస్తే చాలు మనుషులైనా, జంతువులైనా పరారవుతాయి. ఎవరైనా సరే పులిని చూస్తే పరుగులు పెడతారు. కాని..కుక్కల దెబ్బకు చిరుత పరుగులు పెట్టిన ఘటన బెంగళూరులో జరిగింది. మాగడి దగ్గర తావరకెరె అనే చోట కవిత అనే మహిళకు ఫాహ్ హౌజ్ ఉంది. రక్షణ కోసం కవిత కుక్కలను పెంచుకుంటున్నారు. చిరుత ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో..చిరుత ఫాం హౌజ్‌లోకి చొరబడింది. ఇది గమనించిన కుక్కలు అరవడం ప్రారంభించాయి. కుక్కల అరుపులకు చిరుత పరుగు తీసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఆ చిరుతే మళ్లీ వచ్చిందా?.

కొన్ని రోజుల క్రితం ఇదే తోటలోకి వచ్చిన చిరుత ముధోల్‌ జాతి కుక్కను వెంటాడింది. ఆ ఘటనతో జాగ్రత్త పడిన కవిత రక్షణ కోసం ఆరు కుక్కలను ఫాంహౌస్‌కు తీసుకొచ్చారు. చిరుత మంగళవారం అర్ధరాత్రి సమయంలో చొరబడి వరండా అంత తిరిగింది. కుక్కలు ఉంటున్న గది వద్దకు వెళ్లి గాండ్రించింది. చిరుతను చూసిన కుక్కలు జోరుగా అరుస్తూ వెంట పడ్డాయి. దీంతో ఆ చిరుత పరుగులు పెట్టింది. చిరుతలు వస్తున్నాయని అటవీ అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని కవిత వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చిరుతలను అటవీలోకి తరమాలని కవిత విజ్ఞప్తి చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.