మొబైల్ కేబుల్ ను కావాలనే చొప్పించి..వైద్యులతో అలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 12:00 PM GMT
మొబైల్ కేబుల్ ను కావాలనే చొప్పించి..వైద్యులతో అలా

శస్త్ర చికిత్స ద్వారా ఓ వ్యక్తి మూత్రాశయంలో ఇరుక్కుపోయిన మొబైల్ ఛార్జర్ కేబుల్ ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఈ విషయాన్ని శస్త్ర చికిత్స చేయడంలో పాల్గొన్న ఓ వైద్యులు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వెలుగులోకొచ్చింది. అసలు ఆ వ్యక్తి మూత్రాశయంలోకి ఛార్జింగ్ కేబుల్ ఎలా వెళ్లిందన్న అనుమానం మీక్కూడా వస్తోంది కదూ..

వివరాల్లోకి వెళ్తే గుహవటికి చెందిన 30 ఏళ్ల వయసు గల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. అసలు సమస్యేమిటో తెలుసుకునేందుకు ఎక్స్ రే తీశారు వైద్యులు. అందులో అతడి మూత్రాశయంలో మొబైల్ ఛార్జింగ్ కేబుల్ ఉన్నట్లు గుర్తించిన వారంతా అవాక్కయ్యారు. ఆ కేబుల్ అసలు అలా ఎలా వెళ్లిందో తెలుసుకునేందుకు ఆ వ్యక్తిని ప్రశ్నించగా..పొరపాటున తానే నమిలేశానన్నాడు. కానీ స్కానింగ్ ద్వారా తెలిసిందేమిటంటే..అతడు పురుషాంగం ద్వారా ఛార్జింగ్ వైర్ ను చొప్పించాడు. అంతేకాదు అతడి మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదంటున్నారు వైద్యులు.

Next Story