షాద్‌నగర్‌ సమీపంలో వెటర్నరీ డాక్ట‌ర్ దారుణ హత్య కు గురికావడం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శంషాబాద్‌లోని మృతురాలి నివాసం వద్ద స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందింతులను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు ఆలస్యంగా స్పందిచారంటూ స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ‘దుండగులపై కేసులు వద్దు.. ఎన్‌కౌంటర్‌ చేయండి’ అంటూ ఫ్లకార్డులతో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికులను పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు మాత్రం పోలీసులు చర్యను ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

One comment on "కేసులు వ‌ద్దు.. ఎన్‌కౌంట‌ర్ చేయండి..?"

Comments are closed.