'వైద్యురాలి' ఆస్తికలను కృష్ణానదిలో కలిపిన కుటుంబీకులు

తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలు అత్యాచారం, హత్య ఘటన తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమె ఆస్తికలను కృష్ణానదిలో కలిపారు. ఈ రోజు బాధితురాలి కుటుంబ సభ్యులు గద్వాల జిల్లా అలంపూర్ తాలుక ఇటిక్యాల మండలంలో వైద్యురాలి అస్తికలను బీచుపల్లి కృష్ణానదిలో కలిపారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో తుంగభద్రా నది ఒడ్డున సాంప్రదయ పరంగా ప్రేత్యేక పూజల నిర్వహించిన, అనంతరం కుమార్తె ఆస్తికలను తుంగభద్రా నదిలో కలిపారు.
కోదండరాముల వారిని దర్శనం చేసుకోవాలనుకుంటే..ఇలా తన బిడ్డ ఆస్తికలను కలపాల్సి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తక్షణమే ఆ నీచులను కాల్చివేసి మరే బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు.