కరోనాకు డాక్టర్- ఐపీఎస్ విరుగుడు
By రాణి Published on 24 April 2020 8:36 AM GMTకరోనా వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ గానీ, విరుగుడు మందు గానీ అందుబాటులోకి రాలేదు. తాజాగా డబ్ల్యూహెచ్ఓ కరోనా కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ను జంతువులపై ప్రయోగించగా అది సక్సెస్ అయినట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా కూడా వ్యాక్సిన్ కనుగొను పనిలో నిమగ్నమయింది. అతికొద్దిరోజుల్లోనే వ్యాక్సిన్ ను కనుగొన్నా అది మనుషులపై ప్రయోగించాక, లైసెన్స్ వచ్చి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కనీసం సంవత్సరమైనా పడుతుందన్నది శాస్త్రవేత్తల అంచనా.
ఇలాంటి సమయంలో ఏపీ అడిషినల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్ ) గా పనిచేస్తున్న డా. రవిశంకర్ అయ్యనార్ (ఐపీఎస్) కరోనా వైరస్ సోకకుండా..సోకిన వారికి ఓ పరిష్కారమార్గాన్ని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా పొవైడొన్ అయోడిన్ వాడే విధానం అంటూ ఆయన రూపొందించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ మందు ఏంటి ? ఎలా వాడాలో వీడియోలో చూపించారు రవిశంకర్ అయ్యనార్.
Also Read : మహారాష్ట్ర మంత్రికి కరోనా.. పోలీస్ అధికారి నుంచే..!
'' 2% బెటాడిన్ గార్గ్లే ని బాటిల్ తో పాటు ఇచ్చిన కప్పులో 15 మిల్లీలీటర్లు ఒక గ్లాసులో తీసుకోవాలి. దానికి సమానంగా నీరు పోసి కలపాలి. ఈ మిశ్రమంలో ఇయర్ బడ్ ను ద్రావణంలో తడిపి ఒక ముక్కు రంధ్రంలో పూయాలి. తర్వాత ఇయర్ బడ్ రెండో వైపును ద్రావణంలో కలిపి ముక్కు రెండవ రంధ్రంలో రాయాలి. మిగిలిన మిశ్రమాన్ని నోటిలో వేసుకుని 30 సెకన్లపాటు పుక్కిలించాలి. తర్వాత డ్రైన్ లోకి వెళ్లేలా మీ నోటిలో ఉన్న దానిని ఉమ్మివేయాలి. ముక్కు శుభ్రం చేసిన ఇయర్ బడ్ ను కూడా డస్ట్ బిన్లో వేయాలి.
కరోనా పాజిటివ్ ఉన్నవారు ఈ రకంగా బెటాడిన్ గార్గ్లే తో రోజుకు నాలుగుసార్లు పుక్కిలించడం వల్ల వైరస్ పెరగకుండా, ఇతరులకు సోకకుండా కాపాడుతుంది. కేవలం వైరస్ ఉన్నవారే కాకుండే లాక్ డౌన్ లో డ్యూటీ చేస్తున్నవారితో పాటు ఇంట్లో ఉన్నవారు కూడా ఉదయాన్నే టిఫిన్ తర్వాత 2 సార్లు, భోజనం తర్వాత ఒకసారి చేస్తే మంచి ఫలితాలుంటాయి.'' అని రవిశంకర్ అయ్యనార్ చెప్తున్నారు. ఇది కేవలం ఆయన మాత్రమే చేసిన ప్రయోగం కాదు..అయ్యనార్ భార్య వృత్తి రీత్యా వైద్యురాలు. వీరిద్దరూ కలిసి కరోనా ను నివారించేందదుకు కనుగొన్న పరిష్కారమిది.
Also Read : కరోనా సమయంలో నివి చెప్పిన ‘చిరు’ మార్పులు