కరోనా సమయంలో నివి చెప్పిన 'చిరు' మార్పులు

By రాణి  Published on  24 April 2020 5:46 AM GMT
కరోనా సమయంలో నివి చెప్పిన చిరు మార్పులు

కరోనా వైరస్ విజృంభణతో దాదాపు ప్రపంచమంతా లాక్ డౌన్ అయింది. 70 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. భారత్ లో ఏకంగా 43 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రధాని మోదీ చెప్పిన లాక్ డౌన్ గడువు మే 7 తో పూర్తి కానుంది. ఆ తర్వాత కూడా వైరస్ తగ్గుముఖం పడితేనే లాక్ డౌన్ ను దశలవారీగా వేస్తారు. లేకుంటే మే నెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Also Read : త్వరలోనే కొండ పోచమ్మ సాగర్ కు కాళేశ్వరం నీరు

కాగా..కరోనా వైరస్ మనుషులకు చాలా పాఠాలు నేర్పింది. వైరస్ పుణ్యమా అని మన జీవన శైలిలో స్వల్ప మార్పులొచ్చాయి. ఒకప్పుడు బయటికెళ్లొస్తే ఇంట్లో పెద్దాళ్లు కాళ్లు, చేతులు కడుక్కోవాలని చెప్పినా వినిపించుకోని వారు..ఇప్పుడు వైరస్ బారి నుంచి రక్షణ పొందేందుకు ఇంటి గుమ్మం దాటి అలా వసారాలోకి వెళ్లినా చేతులు కడుక్కుని శానిటైజర్లు పూసుకుంటున్నారు. బహుశా ఇలాంటి వాటిని మళ్లీ గుర్తు చేయడానికే వచ్చిందేమో కరోనా.

Also Read : నాగబాబు కౌంటర్..విజయ సాయి రివర్స్ కౌంటర్

మెగా మనుమరాలు..అదేనండి చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కి కూతురైన నివి కరోనా కారణంలో ప్రకృతిలో చోటు చేసుకున్న' చిరు' మార్పుల గురించి చెప్తూ ఓ వీడియో రూపొందించింది. నివి చెప్పిన ఆ చిరు మార్పులేంటో తెలుసుకుందాం..

'' హాయ్..కరోనా వైరస్ వచ్చాక భూ మండలంపై చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో నీటి కాలుష్యం, గాలి కాలుష్యం చాలా తగ్గింది. కాలుష్యం తగ్గడంతో ఆకాశం కూడా చాలా అందంగా కనిపిస్తోంది. వైరస్ తగ్గాక కూడా మనం మన జాగ్రత్తల్లో ఉంటే ప్రకృతిలో వచ్చిన ఈ మార్పులను ఇలాగే కంటిన్యూ చేయొచ్చు. #stayhome #staysafe.''

Next Story