త్వరలోనే కొండ పోచమ్మ సాగర్ కు కాళేశ్వరం నీరు

By రాణి  Published on  23 April 2020 4:31 PM GMT
త్వరలోనే కొండ పోచమ్మ సాగర్ కు కాళేశ్వరం నీరు

కొండ పోచమ్మ సాగర్ కు త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కానుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది చేస్తున్న ఏర్పాట్ల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలంగాణ సీఎంఓ వెల్లడించింది. అక్కారం, మర్కూక్ పంపుహౌజుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారని సీఎంఓ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి జరగుకుండా అన్ని నియమాలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని ట్రాన్స్ కో సిఎండి సిబ్బందికి సూచించారు.

Also Read : హెల్మైట్లు అయిపోయాయ్..ఇప్పుడు ఆటోల వంతు

నీటిని ఎత్తిపోయడానికి అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం (6x27) కలిగిన పంపుసెట్లు, మర్కూక్ వద్ద 204 మెగావాట్ల సామర్థ్యం (6x34) కలిగిన పంపులు సిద్దమయ్యాయని సీఎండీ వెల్లడించారు. నాలుగు బృందాలు రేయింబవళ్లు పని చేస్తున్నాయని, అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని సీఎండీ ప్రభాకర్ తెలిపారు. అలాగే పంపుహౌజుల కేబుల్ పనులు చేసే ఇంజనీరింగ్ నిపుణుల బృందం లాక్ డౌన్ కారణంగా ముంబయిలో ఉండిపోవడంతో తమ అభ్యర్థన మేరకు తెలంగాణ డిజిపి మహారాష్ట్ర డిజిపికి లేఖ రాసి, ఫోన్ ద్వారా మాట్లాడి వారికి ప్రత్యేక అనుమతి ఇప్పించారన్నారు. డిజిపి చొరవతో పంపుహౌజుల కేబుల్ పనులు మళ్ళీ నడుస్తున్నాయని, త్వరలోనే నీటిని విడుదల చేస్తామన్నారు.

Also Read : మహిళా ఉద్యోగులపై వీఆర్వో నిర్వాకం..

Next Story