ఓడిపోయే అవకాశమున్న చోట దళితులు, బీసీలు గుర్తుకొస్తారా!

By Newsmeter.Network  Published on  11 March 2020 5:06 AM GMT
ఓడిపోయే అవకాశమున్న చోట దళితులు, బీసీలు గుర్తుకొస్తారా!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ట్విటర్‌ వేదికగా దళితులు, బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు అంటూ ఆరోపించారు. నిత్యం ట్విట్టర్‌ వేధికగా చంద్రబాబు, టీడీపీ నేతలపై విజయసాయి వగ్యాస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. బుధవారం దళితులు, బీసీలను అస్త్రంగా చేసుకొని చంద్రబాబుపై విమర్శలకు దిగారు.

చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్దపీట వేస్తాడని, బలివ్వాల్సిన చోట బీసీలు, దళితులు ఆయనకు గుర్తుకొస్తారంటూ ఆరోపించాడు. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొంది. ఈనెలాఖరులోపు ప్రాదేశిక, మున్సిపల్‌, స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు నిమగ్నమయ్యాయి. ఈ మేరకు టీడీపీసైతం పలు ప్రాంతాల్లో జడ్పీచైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుంది.ఈక్రమంలో విజయసాయి ట్విటర్‌ వేదికగా చేసిన కామెంట్‌ ఆసక్తికరంగా మారింది. గెలిచే అవకాశం ఉన్న చోట తన వాళ్లను బరిలోకి దింపుకుంటున్న చంద్రబాబు.. ఓడేచాన్స్‌ ఉన్న చోట దళితులు, బీసీలను దింపుతున్నారని, మోత్కుపల్లి , మోత్కుపల్లి, పుష్పరాజ్‌, బంగి అనంతయ్య దగ్గర నుంచి వర్లరామయ్య వరకు ఇదే జరుగుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story
Share it