నాన్న‌ నాగ‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ ఏమన్నాడో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 5:14 AM GMT
నాన్న‌ నాగ‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ ఏమన్నాడో తెలుసా..?

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు.. పుట్టిన‌రోజును ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. న‌టుడిగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి.. నిర్మాత‌గా మంచి అభిరుచి గ‌ల చిత్రాలు నిర్మించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు. ప్ర‌స్తుతం బుల్లితెర పై జ‌బ‌ర్దస్త్ షోతో వీక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నారు.

తన 58వ జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు వరుణ్ తేజ్, తనతో కలిసి దిగిన ఒక పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.‘హ్యాపీ బర్త్ డే నాన్న, మీ ముఖం పై చిరునవ్వు చిందించడం కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధం, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందకు మీకు కృతజ్ఞతలు, మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను’ అంటూ వరుణ్ తన పోస్ట్ లో తెలియ‌చేసారు.Next Story
Share it