ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. దీంతో ఆయ‌న అభిమానులు ప‌వ‌న్ ఎలాంటి సినిమా చేయ‌నున్నాడని..? ద‌ర్శ‌కుడు ఎవ‌రని..? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇంకా టైమ్ ఉంది అనుకుంటే… స‌డ‌న్ గా ప‌వ‌న్ బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ లో న‌టించ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రానే వచ్చింది. ఈ క్రేజీ మూవీని బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ – టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ మై ఫ్రెండ్, ఎం.సి.ఎ చిత్రాల ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఇదిలా ఉంటే… ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… క్రిష్ తో ఓ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని తెలిసింది. ఇది రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాదు. జాన‌ప‌ద చిత్రం. ఈ భారీ చిత్రాన్ని ఎ.ఎం.ర‌త్నం నిర్మించ‌నున్నారు. ఈ భారీ చిత్రానికి 100 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ట‌. ఇది ప‌వన్ కెరీర్ లో భారీ బ‌డ్జెట్ మూవీ. హిందీ మిన‌హా మిగిలిన భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి… ఈ భారీ జాన‌ప‌ద చిత్రంతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.