మృత‌దేహాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు.. తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 9:21 AM GMT
మృత‌దేహాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు.. తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

మృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. గతంలో తెలంగాణ ప్ర‌భుత్వం చ‌నిపోయిన వారికి ప‌రీక్ష‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా.. ఈ ఉత్వ‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ ప్రొఫెస‌ర్ విశ్వేశ్వ‌ర రావు హైకోర్టులో ప‌టిష‌న్ దాఖ‌లు చేశారు. టెస్టులు చేయకపోతే కరోనా విస్తరణలో మూడ‌వ ద‌శ‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ తమ వాదనలు వినిపించారు. నెల్లూరు , కర్నూలు లో డాక్టర్లు చనిపోయిన తరువాత పరీక్షలు నిర్వహిస్తేనే కరోన భయటపడిందని పిటీషనర్ కోర్టుకు నివేదించారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(WHO ) తో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడెలెన్స్ పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో.. నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 26 వరకు మరో స్ఫష్టమైన నివేదిక అందివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

Next Story