దేశంలో ఎక్కడాలేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ- డిప్యూటీ సీఎం సుభాష్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 8:42 AM GMT
దేశంలో ఎక్కడాలేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ- డిప్యూటీ సీఎం సుభాష్

అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు లబ్ధిదారులను గుర్తిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 20 లక్షల 50 వేల మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో 8.5 లక్షల మందిని ఐడెండిపై చేసినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 7 లక్షల మందిని గుర్తించామన్నారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులను 5 లక్షలకుపైగా గుర్తించినట్లు తెలిపారు. ఇంకా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. ఇళ్ల స్థలాల కోసం 19 వేల ఎకరాలు రూరల్ లో గుర్తించినట్లు చెప్పారు. పట్టణాల్లో 2500 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. ఇంకా 19 వేల ఎకరాల భూమి అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం సుభాష్. రూ.10వేల కోట్లతో భూమిని సమీకరిస్తామన్నారు. ఒకే సారి ఇన్ని లక్షల పట్టాలివ్వడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కచ్చితంగా రికార్డ్ సాధిస్తారనే విశ్వాసాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ వ్యక్తం చేశారు.

Next Story