కరోనా కట్టడి కోసం అధికారుల సరికొత్త ఆలోచన

By అంజి  Published on  2 April 2020 8:31 PM IST
కరోనా కట్టడి కోసం అధికారుల సరికొత్త ఆలోచన

హైదరాబాద్‌: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,965 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి.

తమిళనాడులో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి అధికారులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా తిరుప్పూరు జిల్లా అధికారులు కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు అందరనీ ఆకట్టుకుంటున్నాయి. తెన్నంపలయం మార్కెట్‌ బయట కరోనా వ్యాప్తి నివారణ డిస్‌ఇన్ఫెక్టెడ్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.

ఇక ఆ దారి గుండా వెళ్లాల్సిన వారు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకొని ఆ టన్నెల్‌ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. దాని లోపలికి వెళ్లగానే నాజిల్స్‌ ద్వారా వ్యక్తి మీద స్ప్రే వారి మీద పడి వైరస్‌ వ్యాప్తి నివారణకు అవకాశం ఉంటుంది.



అయితే దీనికి సంబంధించిన వీడియోను తిరుప్పూర్‌ జిల్లా కలెక్టర్‌ విజయ కార్తికేయర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. తెన్నంపలయం మార్కెట్‌ వద్ద తాము ఏర్పాటు చేసి డిస్‌ఇన్ఫెక్టెడ్‌ టన్నెల్‌ దేశంలోనే మొదటిదని, మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు ఈ టన్నెల్‌ ద్వారానే వెళ్లాలని కలెక్టర్ కార్తికేయన్‌ తన ట్విటర్‌లో చెప్పారు.

టన్నెల్స్‌లో ఉన్న నాజిల్స్‌ ద్వారా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం వ్యక్తి మీద పడుతుంది. అది వైరస్‌ నిర్మూలనకు పూర్తి స్థాయిలో సరిపోతుంది.

Next Story