దిశ కేసు.. త్రిసభ్య కమిషన్ దర్యాప్తు ముమ్మరం

By అంజి  Published on  3 Feb 2020 10:11 AM GMT
దిశ కేసు.. త్రిసభ్య కమిషన్ దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో న్యాయ విచారణ కమిషన్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు నియమించిన న్యాయ విచారణ కమిషన్‌ హైదరాబాద్‌ చేరుకుంది. కమిషన్‌లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్‌కర్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌లు ఉన్నారు. హైకోర్టు సీ బ్లాక్‌లో కమిషన్‌ సభ్యులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దిశ ఎన్‌కౌంటర్‌ కేసు న్యాయ విచారణ దర్యాప్తు హైకోర్టు వేదికగా సాగనుంది. నిందితుల పోస్టుమార్టం, రీ పోస్టుమార్టం నివేదికలను సభ్యులు పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నుంచి కమిషన్‌ వివరాలు సేకరించనున్నది. ఈ నేపథ్యంలో వారికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన డైరీలను కమిషన్‌ సభ్యులు పరిశీలిస్తున్నారు.

దిశ కేసులో జ్యూడిషియల్‌ కమిషన్‌ని సిట్ అధికారి మహేశ్‌ భగవత్‌ కలిశారు. మూడు రోజుల పాటు అన్ని ఆధారాలను ఈ కమిషన్‌ సేకరించనుంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిని కమిషన్‌ విచారించనుంది. షీల్డ్‌ కవర్‌లో ఉన్న పోస్టుమార్టం, రీ పోస్టుమార్టం నివేదికలను కమిషన్‌ పరిశీలించింది. నిందితుల కుటుంబ సభ్యులతో పాటు దిశ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను కమిషన్‌ రికార్డ్‌ చేయనుంది. రేపు మరోసారి హైకోర్టు వేదికగా కమిషన్‌ విచారణ జరపనుంది.

డిసెంబర్‌ 12న చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్‌కౌంటర్‌పై ఎన్‌కౌంటర్‌పై వీఎస్‌ సిర్‌పుర్కార్‌ అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ వీఎస్ సిర్‌పుర్కార్‌, బాంబే హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ రేఖ, రిటైర్డ్‌ సీబీఐ డైరెక్టర్‌ కార్తికేయన్‌ను నియమించిన సుప్రీంకోర్టు నియమించింది.

కమిషన్‌కు సీఆర్ఫీఎఫ్‌ భద్రత కల్పిస్తుందని.. కమిషన్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కమిషన్‌ విచారణపై మీడియా కవరేజ్‌ ఉండకూడదని పేర్కొంది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని త్రిసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉందని అప్పుడు జిస్టిస్‌ బాబ్డే వ్యాఖ్యనించారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Next Story