‘దిశ’ కథ సుఖాంతం…పోలీసులకు ‘జై’ కొడుతున్న జనాలు

By Newsmeter.Network  Published on  6 Dec 2019 4:14 AM GMT
‘దిశ’ కథ సుఖాంతం…పోలీసులకు ‘జై’ కొడుతున్న జనాలు

ముఖ్యాంశాలు

  • నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై ప్ర‌జ‌ల హ‌ర్షం
  • పోలీసుల‌పై పూల వ‌ర్షం కురిపిస్తున్న జ‌నాలు
  • ఇదే స‌రైన శిక్ష అంటున్న దేశ ప్ర‌జ‌లు

‘దిశ’ కథ సుఖాంతమైంది. దిక్కులు పిక్కటిల్లాయి… ‘దిశ’ ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రాజధాని ఢిల్లీలో సైతం దద్దరిల్లింది. ఈ ఘటన పార్లమెంట్ ను సైతం కుదిపేసింది. కామాంధులను ఉరి తీయాలంటే రగిలిపోయింది యావద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా క్రొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహిస్తూ నివాళులు అర్పించారు దేశ ప్రజలు. నిర్భయ ఘటన తర్వాత , వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన సమాజం బయపడేలా చేసింది…కాలం మారుతున్నా…కామాంధుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి…! ఆడ పిల్లగా పుడితే చాలా ప్రతి ఒక్కరు భయపడేలా మారిపోయింది. అమ్మతనాన్ని కామాంధులు ఎక్కడ అవమానిస్తారోనని భయపడేలా చేసింది ఈ ఘటన. ఎటు చూసినా కామాంధుల ఆగడాలు… ఎటు విన్నా ఆర్తనాదం… అర్ధరాత్రి సంగతి దేవుడెరుగు పట్టపగలు తిరగాలంటే భయపడేలా చేసింది. ఆడ పిల్లగా పుట్టడం వైద్యురాలికి శాపంగా మారింది.

సంచలనంగా మారిన వైద్యురాలి హత్య ఘటనే కాదు… రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు, చిన్నారులపై జరుగుతున్న ఘటనలతో మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇప్పించండి అంటూ.. వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఓ మహిళా లెక్చరర్ దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వరుసగా జరుగుతోన్న ఘటనతో మహిళల్లో ఎలాంటి భయాందోళన నెలకొందే తెలిపేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఘటన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిశ నిందితులను విచారణ నిమిత్తం హత్య చేసిన స్థలానికి తీసుకువచ్చి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా , నిందితులు పారిపోయేందుకు యత్ననించడమే కాకుండా, పోలీసులపై రాళ్లు రువ్వేందుకు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేయడంతో దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు చేసిన పని సరైందేనంటూ పోలీసులకు ‘జై’ కొడుతున్నారు. సంఘటన స్థలానికి భారీ ఎత్తున చేరుకున్న ప్రజలు ‘శభాష్ పోలీస్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు.

Next Story