డిస్కోరాజా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్.. ఇంత‌కీ రియాక్ష‌న్ ఏంటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 8:47 AM GMT
డిస్కోరాజా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్.. ఇంత‌కీ రియాక్ష‌న్ ఏంటి..?

మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘డిస్కో రాజా’ . రజిని తాళ్లూరి నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాలోని ‘నువ్వు నాతో ఏమన్నవో’ అనే పల్లవితో సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

R

థమన్ స్వరపరిచిన మెలోడియస్ ట్యూన్‌కి, గాన చక్రవర్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తన మధురమైన గాత్రంతో ఈ పాటను ఎంతో మధురంగా ఆలపించడం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన అందమైన సాహిత్యం, ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.

Next Story
Share it