వెబ్ సిరీస్... వైజాగ్ సిటీ... రామ్ గోపాల్ వర్మ....

By Newsmeter.Network  Published on  28 Dec 2019 8:54 AM GMT
వెబ్ సిరీస్... వైజాగ్ సిటీ... రామ్ గోపాల్ వర్మ....

సంచలన సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వెబ్ సిరీస్ ల ప్రపంచంలోకీ అడుగుపెట్టబోతున్నారు. తన వివాదాస్పద టైటిళ్లు, ఇంకా సంచలనాత్మక కంటెంట్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మ ఇప్పడిక వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. ఎప్పట్లాగే ఈ వెబ్ సిరీస్ ముంబాయి మాపియా నేపథ్యంలో రూపొందబోతోంది. 1980 నుంచి 1990 వ దశకం వరకూ ముంబాయిని గడగడలాడించి, ముంబాయి పేలుళ్లకు సూత్రధారిగా నిలిచిన కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం నేపథ్యంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఇప్పటికే వర్మ కంపెనీ అనే సినిమాను ఇదే నేపథ్యంలో నిర్మించారు. 2002 లో రూపొందిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, వివేక్ ఒబేరాయ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. తన సినిమా ముంబాయి డాన్ల నేపథ్యంలోనే ఉండబోతోందని ఆయన వెల్లడించారు.

తాను ఈ అంశంపై గత రెండు దశాబ్దాలుగా ఎంతో సమాచారాన్ని సేకరించానని, అందుకే ఒక వెబ్ సిరీస్ మాత్రమే ఈ సమాచారాన్ని చూపించడంలో న్యాయం చేయగలదని ఆయన అన్నారు. అందుకే తాను వెబ్ సిరీస్ మాద్యమాన్ని ఎంచుకున్నానని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఆయన పార్థ సూరి, నైనా గంగూలీలు నటించిన బ్యూటిఫుల్ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు విశాఖపట్నానికి వచ్చారు. ఈ సినిమా తన సినిమా రంగీలాకు సీక్వెల్ లా ఉంటుందని ఆయన అన్నారు. రంగీలాలో ఆమిర్ ఖాన్, ఉర్మిళా మాంతొండ్కర్ లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా తన గ్యాంగ్ స్టర్, క్రైమ్ సినిమాలకు భిన్నమని, ఇది ప్రధానంగా రొమాంటిక్ జోనర్ సినిమా అని ఆయన చెప్పారు.

ఇక మూడు రాజధానుల విషయంలో ఆయనను ప్ర శ్నించగా రాజధాని ఎక్కడ ఉన్నా పెద్ద ఇబ్బందేమీ లేదు. రాజధాని అనకాపల్లిలో ఉన్నా తనకు ఇబ్బందేమీ లేదని ఆయన అన్నారు. విశాఖ పట్నం ఒక సినిమా పరిశ్రమ కేంద్రంగా అభివృద్ది చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఏ పరిశ్రమైనా ఒకే చోట కేంద్రీకృతమై ఉండటం సరికాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత, ఏపీ నిర్మాతల సంఘం నేత నట్టికుమార్ విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల టూరిజం, సినిమా పరిశ్రమకు ఎంతో లాభమని ఆయన అన్నారు. 2014 ఓనే చిత్ర పరిశ్రమ శివరామకృష్ణన్ కమిటీకి ఒక మెమెరాండం ఇచ్చి వైజాగ్ ను రాజధాని చేయాలని కరిందని గుర్తు చేశారు. ఏ పర్యాటక స్థలమైనా వైజాగ్్ నుంచి కేవలం మూడు గంటల దూరంలోనే ఉండటం మనకు లాభదాయకమని ఆయన అన్నారు.

Next Story