క‌నిపిస్తే కొడ‌తా..!

By Newsmeter.Network  Published on  29 Dec 2019 10:32 AM GMT
క‌నిపిస్తే కొడ‌తా..!

మీరు ముగ్గురు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. దాదాపు రెండు మూడు సంవ‌త్స‌రాల నుంచి క‌లిసి ట్రావెల్ చేస్తున్నారు. ఒక‌రికొక‌రు హెల్ప్ చేసుకుంటారు. ఒక‌రి కోసం వేసుకున్న దోశెల‌ను మ‌రొక‌రు తినేంత బోలెడంత‌ స్నేహ బంధం మీ మ‌ధ్య‌న ఉంది. ఈ క్ర‌మంలోనే ఒక‌రి గురించిన బ్యాడ్ అండ్ గుడ్ క్వాలిటీస్ మ‌రొక‌రికి త‌ప్ప‌నిస‌రిగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ క్వాలిటీస్ ఏంటో చెప్ప‌క‌పోయారో ఇక్క‌డ కాక‌పోయినా బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా కొడ‌తా.

ఇవి మ‌త్తు వ‌ద‌ల‌రా చిత్రం ప్ర‌ధాన పాత్ర‌దారుల‌ను ఉద్దేశించి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌లు. కాగా, ఈ నెల 25న వెండితెర‌మీద‌కు వ‌చ్చిన ఈ చిత్రం సినీ విమ‌ర్శ‌ల‌కు ప్ర‌శంస‌ల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. సంగీత దిగ్గ‌జం ఎస్ఎస్ కీర‌వాణి కుమారుడు శ్రీ సింహా క‌థానాయ‌కుడి, డైరెక్ట‌ర్‌గా రితేష్ రాణాను ప‌రిచ‌యం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఇప్ప‌టికే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి వసూళ్ల‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌మోష‌న్స్‌ను మ‌రింత వేగ‌వంతం చేసింది. అందులో భాగంగానే, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని సైతం రంగంలోకి దించింది చిత్ర బృందం. అయితే, వినూత్న ఆలోచ‌న‌ల‌తో సినీ ప్ర‌మోష‌న్స్ చేయ‌డంలో రాజ‌మౌళి దిట్ట‌. ఆ క్ర‌మంలో రాజ‌మౌళి ఈ చిత్రం క‌థానాయ‌కుడితోపాటు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన శ్రీ‌సింహా, క‌మెడియ‌న్ స‌త్య‌. అగ‌స్త్య‌ల‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు.

ముగ్గురిపై ప్ర‌శ్న‌లు సంధించిన రాజ‌మౌళి చివ‌ర్లో ఒక‌రి గురించి మ‌రొక‌రు గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలంటూ ఫిటింగ్ పెట్టాడు. అంతేకాదు మీరు చెప్పింది త‌ప్ప‌ని తెలిస్తే ఇక్క‌డ కాక‌పోయినా.. ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ కొడ‌తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శ్రీ సింహా, క‌మెడియ‌న్ స‌త్య‌. అగ‌స్త్య‌లు నిజాలు చెప్ప‌క త‌ప్ప‌లేదు.

ముందుగా శ్రీ సింహా స‌త్య గురించిన విష‌యాలు చెప్తూ, సీనియ‌ర్‌న‌న్న భావ‌న ఏ మాత్రం లేకుండా, న‌ట‌న‌లో కొత్త పుంత‌లు తొక్కుతున్న త‌మ‌తో చాలా ఈజీగా క‌లిసిపోయార‌ని అది త‌న‌లో ఉన్న గుడ్ క్వాలిటీగాను, సెట్‌లో చెప్పిన టైమ్‌కు వ‌చ్చేస్తుండ‌టాన్ని బ్యాడ్ క్వాలీగాను చెప్పుకొచ్చాడు. అలాగే శ్రీ సింహా గురించి స‌త్య మాట్లాడుతూ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చాన‌ని కాకుండా గ్రౌండ్ రియాల్టీ తెలిసిన వ్య‌క్త‌ని, అత‌ని నుంచి నేర్చుకున్న‌ది కూడా అదేనంటూ చెప్పాడు. ఇలా రాజ‌మౌళి చేసిన ఇంట‌ర్వ్యూ ఆద్యాంతం ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

Next Story