యాక్షన్ కోసం రెడీ అవుతున్న 'ఫైటర్' !

By Newsmeter.Network  Published on  26 Dec 2019 3:39 PM GMT
యాక్షన్ కోసం రెడీ అవుతున్న ఫైటర్ !

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జనవరి 20 నుండి మొదలుకానుందని ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ స్ తియనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం యాక్షన్ జోనర్ లో తెరకెక్కనుంది.. అయితే సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారి ఆసక్తికి తగ్గట్లుగానే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విజయ్‌ దేవరకొండ సరసన నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాన్వి హీరోయిన్ గా చెయ్యటానికి అంగీకరించినట్లు బాలీవుడ్ మీడియా కూడా వార్తలు రాస్తోంది. విజయ్ దేవరకొండ కూడా చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడట. కరుణ్ జోహారే జాన్విని ఒప్పించాడట. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారని అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి కానున్నాడు. అన్నట్లు ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Next Story
Share it