ప‌ర‌శురామ్ నెక్ట్స్ మూవీ - ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 11:07 AM GMT
ప‌ర‌శురామ్ నెక్ట్స్ మూవీ - ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

గీత గోవిందం సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్. ఈ సినిమా సంచ‌ల‌నం సృష్టించ‌డంతో ప‌ర‌శురామ్‌తో సినిమా చేసేందుకు చాలా మంది హీరోలు, నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపించారు. అయితే... ప‌ర‌శురామ్ మాత్రం ఈసారి స్టార్ హీరోతోనే సినిమా చేయాలి నిర్ణ‌యించుకున్నాడ‌ని సమాచారం‌. ఈ నేపథ్యంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో ప‌ర‌శురామ్ సినిమా అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే... మ‌హేష్ క‌థ బాగుంది అని చెప్పాడు కానీ.. డేట్స్ మాత్రం ఇవ్వ‌లేదు. ఆత‌ర్వాత అఖిల్‌తో ప‌ర‌శురామ్ సినిమా అని వార్త‌లు వ‌చ్చాయి. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదు. ఆత‌ర్వాత ఎన్టీఆర్, ప్ర‌భాస్, నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌కు క‌థ‌లు చెప్పిన‌ప్ప‌టికీ ఎవ‌రూ డేట్స్ ఇవ్వ‌లేదు.

అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ప‌ర‌శురామ్.. చైత‌న్య‌కి ఓ క‌థ చెప్పినట్లు సమాచారం. క‌థ న‌చ్చ‌డంతో చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు తెలుస్తోంది‌. కాగా..ప్ర‌స్తుతం చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మేరకు ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత పరుశురామ్‌తో చైతన్య సినిమా చేస్తాడు అని టాక్ వినిపిస్తోంది. అయితే... ఇది నిజ‌మో కాదో తెలియాల్సివుంది.

Next Story
Share it