మారుతి పై మండిప‌డుతున్నారు.. ఇంత‌కీ ఏమైంది..?

By Newsmeter.Network  Published on  11 Dec 2019 12:22 PM GMT
మారుతి పై మండిప‌డుతున్నారు.. ఇంత‌కీ ఏమైంది..?

యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన తాజా చిత్రం ప్ర‌తి రోజూ పండ‌గే. మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన ఈ సినిమా ఈ నెల 20 రిలీజ్ కానుంది. ఈ మూవీ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. అయితే... ఈ సినిమా ట్రైల‌ర్ ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఇందులో ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ సినిమాలు సాగ‌దీసిన‌ట్టు ఉంటాయ‌ని సెటైర్ వేసాడు.

అక్క‌డితో ఆగ‌కుండా.. జాతీయ స్ధాయిలో అవార్డు గెలుచుకున్న శ‌త‌మానంభ‌వ‌తి సినిమా కూడా సెటైర్ వేసేసాడు. దీంతో నీ సినిమా గురించి చూసుకోకుండా.. వేరే సినిమాలు, డైరెక్ట‌ర్స్ పై సెటైర్ వేయ‌డం ఏంటి..? అంటూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో మారుతి పై మండిప‌డుతున్నారు. చిన్న లైన్ తీసుకుని గౌత‌మ్ మీన‌న్ సాగ‌దీస్తాడు అంటున్నావ్ నువ్వు మాత్రం చేసేది ఏంటి..? హీరోకి ఏదో జ‌బ్బు పెట్టి సినిమా తీస్తావ్ క‌దా..?

దీనికేమంటావ్..? అంటూ మారుతి పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించారు. సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ సినిమా పై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నారు. మ‌రి.. డైరెక్ట‌ర్ మారుతి పై వ‌స్తున్న కామెంట్స్ పై మారుతి కానీ, తేజు కానీ స్పందిస్తాడేమో చూడాలి.

Next Story
Share it