ఎన్టీఆర్, అట్లీ మూవీ ఉంటుందా..? ఉండ‌దా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 5:39 AM GMT
ఎన్టీఆర్, అట్లీ మూవీ ఉంటుందా..? ఉండ‌దా..?

త‌మిళ స్టార్ హీరో విజయ్ 'విజిల్' విడుదలకు ముందు డైరెక్ట‌ర్ అట్లీ హైదరాబాద్ వ‌చ్చారు. అయితే టాలీవుడ్ హీరోల్లో తార‌క్ త‌న‌తో స‌న్నిహితంగా ఉంటార‌ని చెప్పారు. అంతే కాకుండా తెలుగులో సినిమా చేస్తే... తార‌క్ తో చేస్తాన‌ని కూడా అన్నారు. దీంతో తార‌క్ - అట్లీ కాంబినేష‌న్ లో మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది ఆస‌క్తిగా మారింది.

అయితే... బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హోమ్ బ్యానర్‌తో అట్లీ మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మూడు సినిమాల్లో ఒకటి ఎస్‌ఆర్‌కెను హీరోగా చూడవచ్చు. షారుఖ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అట్లీ మరియు అతని భార్య ముంబాయి వెళ్లి షారుఖ్ ని కల‌వ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లో షారుఖ్ - అట్లీ కాంబో మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం.

ఈ మూవీ పూర్తైన త‌ర్వాత షారుఖ్ బ్యాన‌ర్ లో ఇంకా.. అట్లీ రెండు సినిమాలు చేయాల్సి ఉంటుంది. సో.. అట్లీ ఇప్ప‌ట్లో అందుబాటులో ఉండ‌క‌పోవచ్చనే అర్థమవుతుంది. అందుక‌నే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Next Story